Breaking : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు జగిత్యాల ఎమ్మెల్యే సంజీవరావుకు క్లీన్ చిట్ ఇచ్చారు

Update: 2026-02-04 05:41 GMT

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు జగిత్యాల ఎమ్మెల్యే సంజీవరావుకు క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారారంటూ ఆయనపై అనర్హత పిటీషన్ ను విచారించారు. అనంతరం ఈ పిటీషన్ పై తీర్పును మాత్రం ఇన్నాళ్లు రిజర్వ్ లో ఉంచారు. అయితే తాజాగా ఈరోజు మాత్రం సంజీవరావు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చి చెప్పారు.

పార్టీ మారారనడానికి...
సంజీవ్ కుమార్ పార్టీ మారడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆయనపై నమోదయిన అనర్హత పిటీషన్ ను కొట్టివేశారు. దీంతో ఇప్పటి వరకూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు అనర్హత పిటీషన్లపై క్లీన్ చిట్ లభించినట్లయింది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటీషన్లపై వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును స్పీకర్ వెలువరించాల్సి ఉంది.


Tags:    

Similar News