Revanth Reddy : నేడు ఇండోర్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇండోర్ బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2025-01-27 03:13 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఇండోర్ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ జరిగే సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా బయలుదేరి వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి అందరు నేతలు హాజరవుతున్నారు.

రాజ్యాంగంపై దాడిని నిరసిస్తూ...
ఈరోజు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో కాంగ్రెస్‌ ర్యాలీని నిర్వహించనుంది. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ పేరిట ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. అంబేద్కర్‌ జన్మస్థలం మౌ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తుండటంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అక్కడకు బయలుదేరి వెళుతును్నారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీని చేస్తుంది.


Tags:    

Similar News