Revanth Reddy : యాదగిరిగుట్టలో రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లారు. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు

Update: 2025-02-23 08:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లారు. బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.సర్వతాపడం కోసం దాదాపు ఎనభై కోట్లు వ్యయంచేశారు. దాతల నుంచి సేకరించిన బంగారంతో ఈ బంగారు తాపడాన్ని చేయించారు.

భక్తులు అధిక సంఖ్యలో రావడంతో...
రాష్ట్రంలోనే అది ఎత్తయిన ప్రధమ సర్వ తాపడ గోపురం ఇదేనని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనాల విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.


Tags:    

Similar News