Revanth Reddy : వైసీపీ, టీడీపీ, జనసేనలకు రేవంత్ పిలుపు

ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం అభినందనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2025-08-19 12:14 GMT

ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం అభినందనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాలని తెలిపారు. బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని రేవంత్ రెడ్డి కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి బలహీన వర్గాల ప్రయోజనం కోసం పాటుపడే వ్యక్తి అని రేవంత్ రెడ్డి తెలిపారు.

గెలిపించుకోవాల్సిన బాధ్యత
ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే న్యాయకోవిదుడు అవసరమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారి అందరిపైన ఉందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదన్నారు. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆత్మప్రభోదాను సారం పార్లమెంటు సభ్యులు ఓటు వేయాలని రేవంత్ రెడ్డి కోరారు. గతంలో పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేసినప్పుడు నాడు ఎన్టీఆర్ పోటీ పెట్టకుండా హుందాగా వ్యవహరించారని తెలిపారు.


Tags:    

Similar News