నగరంలో రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.మైత్రివనం, బల్కంపేట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటించి అక్కడ ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అమీర్‌పేట్ గంగుబాయి బస్తీలో సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బల్కంపేటలో ముంపు కాలనీలను పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి హామీ...
ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే నీరు తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని కోరారు. అయితే ప్రజలు కూడా విద్యుత్తు స్థంభాలకు, మ్యాన్ హోల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.