Revanth Reddy : రేవంత్ రెడ్డి సింగపూర్ లో తొలి రోజు బిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఉన్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. తొలి రోజు ఆయన సింగపూర్ విదేశాంగ మంత్రి వివీఎస్ బాలకృష్ణతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం వంటి వాటిపై సింగపూర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు.
అవగాహన ఒప్పందం...
దీంతో పాటు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు ప్రభుత్వాలు ఒప్పందాలను మార్చుకున్నారు. తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా నైపుణ్యం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.