Revanth Reddy : నేడు ప్రధానితో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు
revanth reddy met narendra modi
తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
రావాల్సిన పెండింగ్...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానిని కలసి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సహకరించాలని రేవంత్ రెడ్డి కోరనున్నారు. తర్వాత పార్టీ పెద్దలతో ఆయన సమావేశమై వివిధ రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.