Good News : రిపబ్లిక్ డే నాడు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-01-26 06:46 GMT

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి కూడా ఫీజు రీఎంబర్స్ మెంట్ వర్తించేలా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా తమ చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే ఇటీవల తాము అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్లను నియమించామన్నారు.

పద్మశ్రీ అవార్డులపై...
యూజీసీ కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. యూనివర్సిటీలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం పనికి రాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది రాజ్యాంగంపై దాడి చేయడమేనని అన్నారు. యూజీసీ నిబంధనలను మార్చాలన్న కేంద్ర ప్రభుత్వం యోచనను విరమించుకోవాలన్నారు. అలాగే పద్మశ్రీ అవార్డుల ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన గొప్ప కళాకారులను విస్మరించిందన్నారు. చుక్కారామయ్య, అందెశ్రీలకు పద్మశ్రీ ఇవ్వకపోవడం విచారకరమని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News