స్టాలిన్ తో భేటీ... అందుకేనట
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం జరిగింది. జాతీయ రాజకీయాలపై వీరిరువురూ చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం యూపీఏ లో డీఎంకే ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
తృతీయ ఫ్రంట్.....
కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా నీటి వనరుల వినియోగం, రైతుల ప్రయోజనాలు రెండు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒపీనియన్ తో స్టాలిన్ ఏకీభవించినట్లు తెలిసింది. అయితే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం అయినా, అది అధికారంలోకి రావడం కష్టమేనని స్టాలిన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లతో పాటు కుటుంబ సభ్యులున్నారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి కేసీఆర్ స్టాలిన్ ను ఆహ్వానించారు.