Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2026-02-10 03:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది. పార్టీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల పై ఆయన చర్చించనున్నారు. కొందరు నేతలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి...
అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్ డేట్ ను కూడా పెద్దలకు ఇవ్వనున్నారు. దీంతో పాటు తెలంగాణలో జరగనున్న మరో ఉప ఎన్నిక గురించి కూడా పార్టీ పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఢిల్లీ వెళ్లే ముందు నేడు మంత్రులు, నేతలతో సీఎం రేవంత్‌ జూమ్‌ మీటింగ్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల పరిస్థితిపై ఆరా తీయనున్నారు.


Tags:    

Similar News