Harish Rao : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని హరీశ్ రావు అన్నారు. 2024 జూన్ 2వ తేదీ వరకూ ఆరోగ్య శ్రీకి నెలకు 32 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అసెంబ్లీ లో హరీశ్ రావు అన్నారు.
నిధులు విడుదల చేయకుండా...
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ఖర్చు 89 కోట్ల రూపాయలుగా ఉందని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయీలు పెరిగాయని, తద్వారా పేదలు ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. పది లక్షలకు పెంచితే సరిపోతుందా? అని నిలదీశారు.