Kavitha : కవిత కొత్త పార్టీ ఏప్రిల్ 25న

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు.

Update: 2026-03-27 12:03 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల 25వ తేదీన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు.ఏప్రిల్ 25వ తేదీన ఉదయం పది గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు కవిత ప్రకటించారు. అలాగే మేడ్చల్ లోని మునీరాబాద్ వద్ద ఉన్న అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరిస్తామని తెలిపారు.

వచ్చే నెల 25న...
రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సమయానికి అక్కడకు చేరుకోవాలని కవిత పిలుపు నిచ్చారు. తన పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని కవిత తెలిపారు. మహిళల్లో మార్పు తెచ్చేందుకే తాను పార్టీని పెడుతున్నట్లు కవిత చెప్పారు. ఆరోజు పార్టీ ప్రకటనకు బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తరలి రావాలని కవిత పిలుపు నిచ్చారు. నిజామాబాద్ లో ఆమె శ్రీరామనవమి రోజున కొత్త పార్టీ ప్రకటన చేశారు.


Tags:    

Similar News