Revanth Reddy : పేదలకు మెరుగైన వైద్యం.. నిధుల సమస్య ఉన్నా?
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెరుగైన విద్యను అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. నిధుల సమస్య ఎంత ఉన్నప్పటికీ పేదల వైద్యం విషయంలో కోత విధించబోమని రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే మన వైద్య నిపుణులు తెలంగాణలోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామనిచెప్పారు. పేదలందరికీ జీవిత బీమా కల్పిస్తున్నామని చెప్పారు. 2,408 కోట్లు ఆరోగ్య శ్రీ నిధులు తాము విడుదల చేశామన్నారు.
నిధుల కొరత ఉన్నా...
ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతి నెల 30 కోట్ల రూపాయలు, ప్రయివేటు ఆసుపత్రులకు యాభై కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రయివేటు వైద్య శాలలో పనిచేసే వారు కూడా కొంత సమయాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. సమాజ సేవ కోసం వారు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పేదలకు విద్య,వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి తెలిపారు.