Revanth Reddy : భద్రాచలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

Update: 2026-03-27 06:20 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు పాల్గొన్నారు. భద్రాచలం ఆలయ అభివ‌ృద్ధి కోసం మొత్తం 586 కోట్ల రూపాయలతో ఈ పనులను ప్రారంభించనున్నారు.

586 కోట్ల రూపాయలతో...
తొలుత 361 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు సీతారాముల కల్యాణానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం అభివృద్ధి పనులను ప్రారంభించారు.


Tags:    

Similar News