Telangana : ఈ నెల 23న మంత్రి వర్గ సమావేశం
ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది
ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వరస విజయాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ మిగిలిన ఎన్నికలు కూడా త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై...
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశ్యంతో ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు.