ప్రత్యూష మృతి కేసు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలంటూ

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది

Update: 2026-02-17 05:36 GMT

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నాలుగు వారాల్లోగా సిద్ధార్ధరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష మృతి చెందిన కేసులో నిందితుడు సిద్ధార్థ్‌రెడ్డి ఐదేళ్ల కారగారశిక్షను రెండేళ్లకు హైకోర్టు కుదించింది. దీంతో ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు వాదనలను వినింది. గత నవంబర్‌లో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ప్రత్యూష మృతి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది.

హైకోర్టు తీర్పును సమర్థిస్తూ...
ప్రత్యూష మృతిపై తనకు అనేక అనుమానాలున్నాయని ఆమె తల్లి న్యాయస్థానం ఆశ్రయించడంతో ప్రభుత్వం కూడా సీబీఐతో విచారణ జరిపింది.ఇరవై నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సిద్ధార్ధ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఆయనను నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు విధించిన యాభై వేల జరిమానాను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.


Tags:    

Similar News