సిద్ధార్థ్ రెడ్డి అప్పీల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా లొంగిపోవాల్సిందే
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో అత్యాచారం, హత్య ఆరోపణలు నిరూపణ కాలేదని స్పష్టం చేసింది. ఇది ఆత్మహత్యకు ఉసికొల్పడం నేరంగా భావించాల్సి ఉంటుందని, దానికి ప్రేరేపించిన నేరం వర్తిస్తుందని తేల్చింది.23 ఏళ్లుగా సాగిన ఈ కేసులో తీర్పు వెల్లడించిన జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ గొంతు నులిమినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అత్యాచారం జరిగినట్టు కూడా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. విషం తీసుకున్నట్టు తేలిందన్నారు. నిందితుడిపై ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆత్మహత్యకు ఉసికొల్పడం నేరమేనని, అందుకేు ప్పీల్‌లు కొట్టివేస్తున్నామని అన్నారు. సిద్ధార్థ్ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ధర్మాసనం తెలిపింది. 2002 ఫిబ్రవరిలో పురుగుమందు తాగి ప్రత్యూష మృతి చెందింది. అదే ఘటనలో సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.