Telangana : ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లపై క్లారిటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓటుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది

Update: 2026-02-14 04:50 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓటుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో హంగ్ ఏర్పడటంతో ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభలకు ఎక్స్ అఫిషియో ఓట్లను వినియోగించుకోవచ్చు.

అక్కడ మాత్రమే...
అయితే నియోజకవర్గ పరిధిలోనే ఏదైనా ఒక మున్సిపాలిటీని ఎంచుకుని అందులో ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవచ్చు. ఓటు ఉన్న మున్సిపాలిటీల్లోనే ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో ఓటు ను వినియోగించుకునే హక్కు ఉంటుంది. ఓటు ఉన్న మున్సిపాలిటీల్లోనే రాజ్యసభ సభ్యులకు తమ ఓటును వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.


Tags:    

Similar News