Telangana : నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ
నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభించనున్నారు
నేటి నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ విచారణ ప్రారంభించనున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం విచారణ వాయిదా వేసిన విచారణ నేటి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాదరావు కొనసాగించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ పార్టీ మారలేదని క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దానం నాగేందర్ పిటీషన్ పై...
మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లను స్పీకర్ విచారించాల్సి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటీషన్లను విచారించాల్సి ఉంది. నేడు ఉదయం పదకొండు గంటలకు దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై స్పీకర్ విచారించనున్నారు. ఈ విచారణకు బీఆర్ఎస్ న్యాయవాదులు హాజరై తమ వాదనలను వినిపించనున్నారు.