Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురి స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

Update: 2026-01-09 03:40 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నల్లగొండ జిల్ల మిర్యాలగూడలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. మిర్యాలగూడ బైపాస్ లో మలుపు తిరుగుతుండగా లారీని అతి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు.

అతి వేగంతో పాటు...
మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంతో పాటు పొగమంచు కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News