Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మంచిర్యాల జిల్లాా జైపూర్ మండలం శ్రీరాంపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈరోజు తెల్లవారు జామున బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదంలో మరణించిన వారు ముగ్గురు మహిళలే.
మహారాష్ట్రకు చెందిన...
ఈ ప్రమాదంలో పదమూడు మంది గాయపడ్డారు. మృతులు, గాయపడిన వారు అంతా మహారాష్ట్రకుచెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాలో వరినాట్లు వేసేందుకు వారు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.