Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి .. బిజీబిజీగా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది

Update: 2026-02-12 03:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధిస్తామని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నారు.

కేంద్ర మంత్రులను కలిసి...
ఈరోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలవనరులు శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలవనున్నారు. అలాగే రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసే అవకాశముంది. కేంద్ర మంత్రులతో పాటు పార్లమెంటులో పరా్టీ నేత రాహుల్ గాంధీని కూడా కలవనున్నారు. సాయంత్రం ఆయన హైదరాబాద్ కు బయలుదేరి వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News