మంత్రులతో సీఎం రేవంత్‌ జూమ్‌ మీటింగ్‌

మంత్రులతో సీఎం రేవంత్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు

Update: 2026-02-16 03:17 GMT

మంత్రులతో సీఎం రేవంత్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. మేయర్లు, చైర్మన్‌ల ఎన్నికపై రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్లు, ఛైర్మన్ల ఎన్నికలోమనదే పైచేయి కావాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇవ్వనున్నారు. మేయర్లు, చైర్మన్ల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని, హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్సే పైచేయి సాధించాలని ఆదేశించనున్నారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించనున్నారు.

ఎక్స్ అఫిషియో ఓట్ల విషయంలో...
ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు వస్తే చేర్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ సూచించారు. హంగ్ మున్సిపాలిటీల్లో 25కుపైగా కాంగ్రెస్‌కే ఛాన్స్ ఉందని, ఏడెనిమిది చోట్ల మాత్రమే క్లిష్ట పరిస్థితులున్నాయని, అక్కడ కూడా కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి మున్సిపాలిటీని సవాల్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.


Tags:    

Similar News