Revanth Reddy : రోడ్డుపై చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తా : రేవంత్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు

Update: 2026-02-17 12:07 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు. అధికారులతో ఆయన మాట్లాడారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మల్టీ లెవెల్ కారు పార్కింగ్ ను ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో తలెత్తిన సమస్యలను కూడా ఆయన ఈ సమీక్షలో ప్రస్తావించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగాపారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని డివిజన్లలో...
ఇక హైదరాబాద్ ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాతాలతను గుర్తించి అక్కడ స్కైవాక్ లను ఏర్పాటు చేసేందుకు పీపీపీ పద్ధతిని వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే తాను హైదరాబాద్ లోని అన్ని డివిజన్లలో పర్యటిస్తానని, సమస్యలను తాను స్వయంగా గుర్తిస్తానని, ఎక్కడైనా చెత్త కనిపిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.


Tags:    

Similar News