Revanth Reddy : నేడు రేవంత్ కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు

Update: 2026-02-14 02:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేకంగా మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు, దాని ఫలితాలపై చర్చించనున్నారు. మెజారిటీ ఫలితాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఆశించిన రీతిలో ఫలితాలు రాలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చాలా చోట్ల అనుకూల ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను మంత్రులను, నేతలను అడిగి తెలుసుకోనున్నారు.

హంగ్ ఏర్పడిన చోట...
ఇక ఈ నెల16 మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక విషయంలో కూడా చర్చించనున్నారు. అనేక చోట్ల హంగ్ ఏర్పడిన కారణంగా అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన తీరును కూడా చర్చించనున్నారు.


Tags:    

Similar News