Revanth Redddy : మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్లు, పంచాయతీల బాధ్యతలను పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. పార్టీలను, నేతలను సమన్వయం పెంచే దిశగా కొందరు నేతలకు బాధ్యతలను అప్పగించారు. జగిత్యాల పంచాయతీ బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు అప్పగించారు.
మంత్రులకు, నేతలకు బాధ్యతలు...
కొత్తగూడెం కార్పొరేషన్ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ లకు అప్పగించారు. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార రెడ్డి లకు అప్పగించారు. మున్సిపల్ ఫలితాల తర్వాత పార్టీ బలాన్ని కాపాడుకోవడం, స్థానిక నేతల మధ్య సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ బాధ్యతల పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రులు సమన్వయం చేసుకుని అన్ని హంగ్ వచ్చిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని కోరారు.