Revanth Reddy : తెలంగాణపై కేంద్రం వివక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కుంభమేళాకు నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో జరిగే గోదావరి పుష్కరాలకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యూపీ కుంభమేళాకు భారీగా నిధులు కేటాయిస్తూనే, తెలంగాణ పుష్కరాలను విస్మరించడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు.
సమ్మక్క సారలమ్మ జాతరకూ...
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారలమ్మ జాతరకు కూడా నిధులు ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని ఆయన అన్నారు. నిధులు ఇచ్చామని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ప్రకటనలు అవాస్తవమేనని రేవంత్ రెడ్డి అన్నారు.