Telangana : మంచిరేవులలో వంద అడుగుల శివుడి విగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు. మూసీ పునరజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం మంచిరేవులకు చేరుకున్న ముఖమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఆలయాన్ని సందర్శించారు.
సీఎం రేవంత్ శంకుస్థాపన...
ఆలయం నిర్మాణానికి ఏడు వందల కోట్ల రూపాయలు అంచనా వేశారు. వంద అడుగుల భారీ శివుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా నేడు తొలి అడుగు పడిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. మూసీ నదికి ఇరువైపులా ఆహ్లాదరకమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది.