అక్రమ మైనింగ్ పై హరీశ్ మండిపాటు
రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జీవో 111 ప్రకారం కొత్వాల్ గూడలో కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని, కానీ రాఘవ కనస్ట్రక్షన్స్ కమిపెనీ డీజిల్ జనరేటర్ల మీద క్రషర్ ను నడుపుతుందనిఅన్నారు. ఆ సంస్థకు ఎండీఎల్ లైసెన్స్ లేదని, దానికి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ లేదని, కనీసం పరిశ్రమల శాఖ వద్ద రిజిస్ట్రరేషన్ కూడా లేదని హరీశ్ రావు అన్నారు.
షోకాజ్ నోటీసులు ఇచ్చినా...
షోకాజ్ నోటీసులు ఇచ్చినా కనీసం ఆ కంపెనీ రిప్లై కూడా ఇవ్వలేదని తెలిపారు. అక్రమ మైనింగ్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుందని, అయినా దానిపై చర్యలు లేవని అన్నారు. రాఘవ కనస్ట్రక్షన్ పై చర్యలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం అక్రమ మైనింగ్ ను ప్రోత్సహిస్తుందని చెప్పారు. మంత్రికి సంబంధించిన కనస్ట్రక్షన్స్ కాబట్టే చర్యలు లేవని హరీశ్ రావు అన్నారు.