ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు

ఆదాయపు పన్ను శాఖ కంట్లో బంగారు బాబు

Update: 2026-03-28 02:19 GMT

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లికి చెందిన కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీలో ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో స్థానిక ఐటీ అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.

విచారణకు రావాలని...
తదనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఆదాయపుపన్ను శాఖ టాక్స్ అధికారులు నలుగురు వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టు లోనే విచారణ ప్రారంభించారు. తనఒంటిపైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారి పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 12 గంటల పాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం మళ్లీ కొండ విజయ్ కుమార్ ను విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్లు సమాచారం.


Tags:    

Similar News