నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది
నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ దంపతులు హాజరు కానున్నారు. గవర్నర్ దంపతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతంపలకనున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతారు.
గవర్నర్ దంపతులు...
నిన్న సీతారాముల కల్యాణానికి వచ్చినభక్తులు నేడు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని చూసేందుకు భద్రాచలంలోనే ఉన్నారు. అత్యధికకమంది భక్తులు నేడు శ్రీరామ పట్టాభిషేకానికి హాజరు కానుండటంతో భద్రాచలంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు.