నాగర్ కర్నూలు జిల్లాలో విరోష్ జంట
నాగర్‌కర్నూల్ జిల్లాకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక చేరుకున్నారు
నాగర్‌కర్నూల్ జిల్లాకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు భారీగా స్వాగతం పలికారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బలమూరు మండలంలోని తుమ్మెనపేటలో విజయ్-రష్మికల రిసెప్షన్ జరగనుంది. నూతన దంపతులకు గ్రామస్థులు సాదరంగా ఆహ్వానం పలికారు.
స్వాగతం పలికిన...
ఈ రోజు విజయ్ దేవరకొండకు చెందిన ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ వ్రతంతో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. రిసెప్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ జంట ఇప్పటికే తుమ్మెనపేటకు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు విరోష్ జంటకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది.