Telangana : తెలంగాణలోనూ రప్పా రప్పా రాజకీయం
తెలంగాణకు పాకిన రప్పా రప్పా రాజకీయం పాకినట్లు కనపడుతుంది. పుష్ప మూవీ డైలాగ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారింది
తెలంగాణకు పాకిన రప్పా రప్పా రాజకీయం పాకినట్లు కనపడుతుంది. పుష్ప మూవీ డైలాగ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారింది. ఈ మధ్య వైఎస్ గన్ పల్నాడు పర్యటనలో రప్పా రప్పా అంటూ నరికేస్తాం అని ప్లకార్డులు ప్రదర్శిస్తే తాజాగా తెలంగాణలోనూ బీఆర్ఎస్ పార్టీలో ఈ స్లోగన్ వినపడుతుంది. హరీశ్ రావు జిన్నారం పర్యటనలో బీఆర్ఎస్ నేతలు రప్పా రప్పా అంటూ 3.0 2029లో మనదేనంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
బీఆర్ఎస్ ఫ్లెక్సీలలో...
పటాన్ చెర్వు నియోజకవర్గంలో రైతు సదస్సుకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు భరోసా నిధులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు కనిపించడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఏపీ నుంచి పుష్ప సినిమా డైలాగ్ తెలంగాణ రాజకీయాల్లోకి కూడా వైరస్ లా పాకిందనే చెప్పాలి.