శ్రీరాంపూర్ లో పులి సంచారం

శ్రీరాంపూర్ లో పులి సంచారం కలకలం రేపుతుంది

Update: 2025-12-12 04:28 GMT

శ్రీరాంపూర్ లో పులి సంచారం కలకలం రేపుతుంది. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పులిని బంధించడం కోసం బోన్లను ఏర్పాటు చేశారు. ఒంటరిగా ఎవరూ పొలాలకు, అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని కోరారు.

పెద్దపులి కనిపించడంతో
శ్రీరాంపూర్ ఏరియా ప్రాంతంలోని ఆర్కే 8 మైన్ వద్ద పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న ఈ మైన్ ఏరియాలో ప్రజలు రోజువారీ మార్గాల్లో ప్రయాణిస్తుండగా పెద్దపులి సంచారం గుర్తించారు. రామకృష్ణాపూర్ గ్రామస్తులు, మైన్ కార్మికులు అటువైపు వెళ్తుండగా పులి కనిపించింది. భయంతో వెంటనే వెనక్కి తిరిగి వచ్చి స్థానిక అధికారులకు సమాచారం అందించారు.


Tags:    

Similar News