Kalvakuntla Kavitha : తోలు తీస్తా..బండారం బయటపెడతా.. కవిత మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ నేతలకు కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2025-12-12 06:14 GMT

బీఆర్ఎస్ నేతలకు కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను ఎవరినీ వదిలిపెట్టేది లేదని అందరినీ రోడ్డుమీదకు ఈడుస్తానని కవిత అన్నారు. తనపై మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేయడం వెనక హరీశ్ రావు ప్రమేయం ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. మీ అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయవద్దని కోరారు. ఉద్యమ సమయంలో ఎంత మందిని బెదిరించి డబ్బులు తీసుకున్నారో చిట్టా తన వద్ద ఉందని అన్నారు.

త్వరలో మొత్తం బండారాన్ని...
2004లో తాము అమెరికా నుంచి వచ్చిన తర్వాత వ్యాపారం చేసుకుని తమ కుటుంబం బతుకుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు. తనకు కూడా టైం వస్తుందని, తాను కూడా ఏదో ఒకరోజు సీఎం అవుతానని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారందరికీ లీగల్ నోటీసులు ఇస్తానని చెప్పారు. తాను టాస్ మాత్రమే వేశానని, త్వరలో మొత్తం బండారాన్ని బయటపెడతానని కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరి బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తిని కాదన్న కవిత తనపై ఆరోపణలు ఎవరున్నారో తెలుసునని, తోలుతీస్తానని హెచ్చరించారు.


Tags:    

Similar News