మహబూబాబాద్ దేవుని గుట్టపై ఇనపయుగపు రాతి చిత్రకళ
జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న దేవునిగుట్టపై ఇనపయుగపు రాతి చిత్రాల ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు
మహబూబాబాద్, డిసెంబర్,13: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న దేవునిగుట్టపై ఇనపయుగపు రాతి చిత్రాల ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. స్థానిక ఎంపీ, బలరాం నాయక్ ఆదేశాలపై ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలనకై దేవునిగుట్టపై తిరుగుతుండగా, రెండు అడుగుల పొడవు, అర్థ సెంటీమీటర్ వెడల్పు, పావు సెంటీమీటర్ లోతు గల, రాతిని ఇనుపఉలితో కొట్టగా ఏర్పడిన రెండు రేఖలు కనిపించాయని, వాతావరణం వల్ల ఏర్పడిన ముదురు గోధుమ రంగు ఆకృతి ద్వారా అవి ఇనుపయుగానికి చెందినవి ఆయన చెప్పారు. ఆయన వెంట మాలొత్ అరుణ్ నాయక్, బానొత్ భీమా నాయక్, అనుమాల వెంకటేశ్వర్లు, గోపాల్, మాలె శ్యామ కుమార్, విశ్వనాథం, రాజేశ్వర రావు, కొల్లూరి ప్రభాకర్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.