నేడు బీజేపీ మృత్యుంజయ హోమం

ప్రధాని మోదీ భద్రతా లోపం, ఆయన ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి.

Update: 2022-01-10 03:56 GMT

ప్రధాని మోదీ భద్రతా లోపం, ఆయన ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నేడు మృత్యుంజయ హోమాలు జరుగుతాయి. ప్రధాని ఆయురోరాగ్యాలతో ఉండాలని ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు.

ఆయురారోగ్యంతో ఉండాలని...
హైదరాబాద్ లోని అలకాపురిలోని శృంగేరి పీఠంలో జరిగే మృత్యుంజయ హోమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఈ హోమాలు జరగనున్నాయి.


Tags:    

Similar News