గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: పొంగులేటి

తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-03-26 02:38 GMT

తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వాలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష చేపట్టి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామని అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో దాదాపు లక్ష ఇళ్లకు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఆ ఇళ్లలో అనేక పనులు పూర్తి కాలేదని వెల్లడించారు.

మిగిలిన వాటిని...
ఆలాగే 12 వేల ఇళ్లలో ఇప్పటికీ లబ్ధిదారులు ఉండటం లేదని మంత్రి తెలిపారు. ఆయా లబ్ధిదారులకు మూడు నెలల గడువు ఇచ్చి నోటీసులు జారీ చేయగా, అందులో 6 వేల మంది ఇళ్లను ఆక్యూపై చేశారన్నారు. మిగిలిన ఇళ్లను అర్హులైన కొత్త లబ్ధిదారులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.


Tags:    

Similar News