అవయవదానం చేసి నలుగురికి పునర్జన్మ ప్రసాదించిన పూజారి

ఓ ఆలయ పూజారి చనిపోతూ.. చనిపోతూ నలుగురి ప్రాణాలను నిలబెట్టారు.

Update: 2025-06-23 08:30 GMT

ఓ ఆలయ పూజారి చనిపోతూ.. చనిపోతూ నలుగురి ప్రాణాలను నిలబెట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మాధాపురానికి చెందిన భువనగిరి లక్ష్మీనారాయణ ఓ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నారు. జూన్ 16న ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ చెట్టు విరిగి ఆటోపై పడింది. ఆ ప్రమాదంలో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్‌ వైద్య బృందం ఆయన సోదరి దుర్గవాణి, ఇతర కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీనికి వారు అంగీకరించడంతో లక్ష్మీ నారాయణ గుండె, కాలేయం, కిడ్నీలు సేకరించారు. జీవన్‌దాన్‌లో పేర్లను నమోదు చేసుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు.

Tags:    

Similar News