Telangana : రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

రేపు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ జరగనుది

Update: 2026-02-10 03:44 GMT

రేపు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ జరగనుది. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల్లో ఎన్నిక రేపు జరగనుంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం నేడు పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు.

నేడు పోలింగ్ కేంద్రాలకు...
రాష్ట్రంలో ఒకే విడత ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటి పోలింగ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశఆరు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది.


Tags:    

Similar News