రైతుల గోస కేసీఆర్ కు పట్టదా?

వారం రోజులుగా ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2022-07-30 14:06 GMT

వారం రోజులుగా ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులు హాహాకారాలు పెడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. కేసీఆర్ ఢిల్లీలో ఉండి రాజకీయాలు చక్కబెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబం కోసమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రజలకు ఆయన పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు చేసి కొందరికే కాంట్రాక్టులు ఇస్తూ కేసీఆర్ కుటుంబం లబ్ది పొందుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

చీకోటి ప్రవీణ్ ఆగడాలపై....
చీకోటి ప్రవీణ్ ఆగడాలపై కేటీఆర్ ఎందుకు మాట్లాడరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హవాలా దొంగలను ఎందుకు వెనకేసుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గాంబ్లింగ్ కు ఎవరు బిగ్ బాస్ అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో నాలుగు కోట్ల ప్రజలు దగాపడ్డారని అన్నారు. కల్వకుంట కుటుంబం దుష్టచతుష్టయం చేతిలో బందీ అయిపోయందన్నారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి ప్రమాదకరంగా మారిందన్నారు. మాజీ మంత్రి భీమారావు కుమార్తె సరస్వతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫా‌బాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆదివాసీలకు అండగా నిలిచే కుటుంబం అని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సరస్వతికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Tags:    

Similar News