తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టిన ప‌వన్ క‌ల్యాణ్

రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుడి కుటుంబానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.5 ల‌క్ష‌ల

Update: 2022-05-20 14:19 GMT

ఏపీలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. తాజాగా తెలంగాణ‌లో కూడా జ‌న‌సేన పార్టీ జెండా ఎగ‌రాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టనలో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో క‌చ్చితంగా పోటీ చేస్తామ‌ని చెప్పారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణల జనసేన పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్నట్లు ఆ పార్టీ చీఫ్​ పవన్​ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన జ‌న‌సేన క్రియాశీల స‌భ్యుడి కుటుంబానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ రూ.5 ల‌క్ష‌ల బీమా ప‌రిహారాన్ని అందించారు. బీమా ప‌రిహారం చెక్కును బాధిత కుటుంబానికి అంద‌జేశారు. ఇటీవ‌లే రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయిన గోప‌రాజుప‌ల్లికి చెందిన‌ పార్టీ స‌భ్యుడు కొంగ‌రి సైదులు ఇంటికి పవన్ వెళ్లారు. సైదులు భార్య సుమ‌తిని ఆయ‌న ఓదార్చారు. రోడ్డు ప్ర‌మాదంలో సైదులు కుమారుడు కూడా గాయ‌ప‌డ్డార‌న్న విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్‌ అత‌డి ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని సైదులు భార్యకు ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చారు. బిడ్డల చదువు, ఆరోగ్యం బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నల్లగొండకు బయలుదేరిన పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్దనున్న అక్కపురి చౌరస్తా వద్ద జనసైనికులు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాకు వెళుతున్న జనసేనానికి దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. ఎల్బీనగర్ జంక్షన్ లో జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అక్కడ కాసేపు ఆగారు పవన్. అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తెలగాణలో పోటీ చేయలేక పోయామని చెప్పుకొచ్చారు. రానున్న ప్రతి ఎన్నికల్లో తెలంగాణలో జనసెన పార్టీ బరిలో ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.


Tags:    

Similar News