SLBC Accident : టన్నెల్ లో లేటెస్ట్ అప్ డేట్ మీకు తెలుసుకోవాలనుందా?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలకు ముగింపు కనిపించడం లేదు

Update: 2025-04-20 03:52 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలకు ముగింపు కనిపించడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ మొదలయి 58వ రోజుకు చేరుకుంది. టన్నెల్ లో సహాయక చర్యలు ఎప్పటి వరకూ జరుగుతాయన్నది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఆరు మృతదేహాలు లభ్యమయితే తప్ప ఆపరేషన్ ముగియదు. అప్పటి వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాల్సిందేనని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కొన్ని రోజులుగా చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అనేక ఆటంకాలు సహాయక చర్యలకు ఇబ్బందిగా మారుతున్నాయి.

ప్రమాదకరమైన ప్రాంతంలో...
టన్నెల్ లో ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు పై కప్పు నుంచి ఉబికి వస్తున్న నీటితో పాటు మరొకవైపు బురద పేరుకుపోయి దానిని తొలగించాల్సి రావడం, పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండటం. టీబీఎం మిషన్ శకలాలను కూడా బయటకు తరలించాల్సి రావడంతో మృతదేహాల వెలికి తీసే పనిని పక్కన పెట్టి ఈ పనులపైనే సహాయక బృందాలు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. అందుకే ఇంత ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
టన్నెల్ పనులను...
మరోవైపు శ్రీశైలం టన్నెల్ లో పనులను తిరిగి ప్రారంభించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది ఇందుకోసం ఇన్ లెట్ వైపు నుంచి పనులు నిలిచిపోవడడంతో అవుట్ లెట్ వైపు నుంచి తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి టీజీఎం బేరింగ్ మిషన్ ను తెప్పించింది. టీీఎం మిషన్ మరమ్మతులకు గురి కావడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోవడంతో వీలయినంత త్వరగా అవుట్ లెట్ వైపు నుంచిపనులను ప్రారంభించాలని భావిస్తుంది. అమెరికాకు చెందిన కంపెనీ ఈ బేరింగ్ ను తయారు చేసి నౌకలో తరలించగా చెన్నై నుంచి భారీ వాహనంలో టన్నెల్ వద్దకు చేరుకుంది. రెండు నెలల పాటు దీనిని బిగించేందుకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. జులైలో పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు సహాయక చర్యలు మరోవైపు టన్నెల్ లో మళ్లీ పనులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.











Tags:    

Similar News