Telangana : నేడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు.ఈరోజుతో ఆఖరి రోజు కావడంతో నేడు ప్రచారంలో పాల్గొని ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
11న కౌంటింగ్ కావడంతో...
ఈ నెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేటితో ప్రచారం ముగియనుండటంతో రేపు ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు. మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.