ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్ చుట్టూ దయ్యాలు?
కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత సంచలన వ్యాఖ్యలు.. పార్టీ కుట్రలపై తీవ్ర విమర్శలు
అమెరికా నుండి తిరిగొచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయన్నారు. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోందని తెలిపారు. కుట్రలు చేస్తున్న ఆ దయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని ఆరోపించారు. పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఆ లేఖ రెండు వారాల క్రితం కేసీఆర్‌కు తాను రాసిందేనని కవిత స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్‌కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానన్నారు. వరంగల్ సభ తరువాత లేఖ ద్వారా తన అభిప్రాయాలను పార్టీ అధినేతకు వెల్లడించానని కేసీఆర్‌కు లేఖ రాయడంలో తనకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేదని అన్నారు. దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలను మాత్రమే తాను లేఖలో రాశానని చెప్పారు.