పిల్లల మర్రిలో మిస్ వరల్డ్ పోటీ దారులు

మిస్ వరల్డ్ పోటీ దారులు మహబూబ్ నగర్ జిల్లా కు చేరకున్నారు. అక్కడ పిల్లల మర్రిని సందర్శించారు

Update: 2025-05-16 12:12 GMT

మిస్ వరల్డ్ పోటీ దారులు మహబూబ్ నగర్ జిల్లా కు చేరకున్నారు. అక్కడ పిల్లల మర్రిని సందర్శించారు. ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి చెట్టు గురించి వారికి అధికారులు వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న అందాలభామలకు బతుకమ్మ ఆటలతో స్వాగతం పలికారు. ఇరవై దేశాలకు చెందిని సుందరీమణులు సందర్శించారు. చెట్టుచరిత్రను గురించి అడిగి మరీ తెలుసుకుని అక్కడ ఫొటోలకు పోజులిచ్చారు.

ఎకోపార్కుకు వెళ్లి...
అక్కడ ఉన్న పురావస్తు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి విశిష్టతలను గురించి అధికారులు సుందరీమణులకు వివరించారు. హైదరాబాద్ శివార్లలో ఉన్నగండిపేట లో ఉన్న ఎకో పార్కుకు అందాల భామలు చేరుకున్నారు. వారికి తెలంగాణ బరాత్ స్టయిలో స్వాగతం పలికారు. అక్కడ మొక్కలు నాటేందుకు సుందరీమణులు సిద్ధమయ్యారు. అందాల భామల పర్యటనకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News