అప్పులు చేసి తిప్పలు పెట్టింది కేసీఆర్ : ఉత్తమ్
బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడాదికి పదహారు వేల కోట్లు రూపాయలు కడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఐదువేలకోట్ల రూపాయలను పెండింగ్ లో పెట్టారన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో 49 వేల కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చగలిగిందని అన్నారు. ఇంకా యాభై ఆరు కోట్లు కట్టాల్సి ఉందని చెప్పారు. గత పదేళ్లలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలు మాత్రమేనని అన్నారు.
గత ప్రభుత్వంలో రాజీ పడి...
కృష్ణా, గోదావరి జిల్లాల్లో గత ప్రభుత్వహయాంలో రాజీ పడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. నాటి ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ కుమ్మక్కయిన విషయాన్ని ఆయన చెప్పారు. అనేక కార్పొరేషన్ల నుంచి లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చి రాష్ట్రంపై ఆర్థిక భారాన్ని మోపారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ నీతులు చెబితే నమ్మేవారు ఎవరూ లేరని అన్నారు. ప్రజలు ఎవరిని విశ్వసించాలో వారికి తెలుసునని అన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించలేరని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.