Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2025-12-22 04:44 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి విచారించాలని సిట్ సిద్ధమయింది. ఇందులో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చందా కూడా ఉన్నారు. వీరిద్దరికీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో మరొకసారి విచారణకు సిద్ధమయినట్లు తెలిసింది.

ఓఎస్డీగా ఎందుకు ....
ప్రభాకర్ రావును ఎస్ఐబీ ఓఎస్డీగా ఎందుకు నియమించారని? ఎవరి సిఫార్సు మేరకు నియమించారన్న దానిపై ప్రధానంగా సిట్ అధికారులు విచారించనున్నారు. వీరిద్దరిని విచారించిన అనంతరం సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటయిన సిట్ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. ప్రభాకర్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News