Weather Report : మరో రెండు రోజులు చలితీవ్రత తప్పదట

రెండు తెలుగు రాష్ట్రాలు మరికొన్ని రోజుల పాటు చలి గుప్పిట్లో చిక్కుకోకున్నాయి.

Update: 2026-01-13 04:16 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు మరికొన్ని రోజుల పాటు చలి గుప్పిట్లో చిక్కుకోకున్నాయి. వాతావరణ శాఖ అంచనా మేరకు మరికొద్ది రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలితీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రతకు ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.అలాగే పొగమంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రయాణాలు చేసే వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని రోడ్ల మీదకు రావాలని అధికారులు కోరుతున్నారు.

చలి తో పాటు పొగమంచు...
ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత ఎక్కువవుతుంది. అయితే నేడు కూడా వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ప్రధానంగా ఈరోజు కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. ఇక సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో మరో రెండు రోజులు...
తెలంగాణలో రానున్న రోజుల్లో మరింతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నెల రోజుల నుంచి తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. వాస్తవం చెప్పాలంటే డిసెంబరు నెల మొత్తం తెలంగాణ చలిగుప్పిట్లోనే చిక్కుకుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతుండటంతో జనం గత నెల రోజుల నుంచి అల్లాడిపోతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయింది. వచ్చే రెండు రోజుల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జనగాం, జగిత్యాల, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.


Tags:    

Similar News