Weather Report : సాయంత్రం తేలికపాటి వానలు.. పగటి పూట గరిష్టంగా ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2026-02-27 04:26 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావానికి తోడు ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉపరితల ద్రోణి దాటిన తర్వాత తిరిగి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. పొడి వాతావరణం నెలకొంది. అలాగే మరికొన్ని చోట్ల పొగమంచు కూడా ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అక్కడకక్కడ తేలికపాటి...
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు, మోస్తరు వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రమే ఈ రకమైన వాతావరణం ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మోస్తరుగా నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికీ సాధారణ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. నేడు కూడా అంతకంటే కొంత తక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో...
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు బాగానే నమోదవుతున్నాయి. అయితే ఉదయం, సాయంత్రం వేళ చిరు జల్లులు పలకరిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో ఇదే రకమైన వాతావరణం ఉంది. పగటి పూట ఎండలు దంచి కొడుతుండగా, సాయంత్రం వేళకు చల్లబడుతుండటం కొంత ఊరట నిచ్చే అంశమే అయినప్పటికీ రాను రాను ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయని అంటుున్నారు. మరికొన్నొ రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయతే ఈ నెలాఖరు నుంచి గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News